27 May, 2026 | 1:56 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

27-05-2026 12:26 PM

పెంచికల్ పేట్, (విజయక్రాంతి): పెంచికల్ పేట్ మండలంలోని గుండెపల్లి గ్రామానికి చెందిన తలాండి నారాయణ (61) వడదెబ్బకు బాధపడి మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా తునికి ఆకు సేకరణకు వెళ్తున్న నారాయణ మంగళవారం అనుకోకుండా వడదెబ్బకు గురయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రథమ చికిత్స కోసం బెజ్జూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గంలోనే ఆయన మృతి చెందారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు.