నీట్ పరీక్ష విధానాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో రద్దు చేయాలి
- సెప్టెంబర్ 19న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా
- దక్షిణాది జనతా పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
ముషీరాబాద్,ఆగస్టు 16(విజయక్రాంతి): ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల ఎంబీబీఎస్ సీ ట్ల కోసం ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష విధానాన్ని తక్షణమే దక్షిణాది రాష్ట్రాల్లో రద్దు చే యాలని, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం సెప్టెంబరు 19న ఇందిరాపార్కు ఎదుట భారీగా ధర్నా నిర్వహిస్తున్నామని దక్షిణాది జనతా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం హైదర్ గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, మేధావులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.దక్షిణాది రాష్ట్రాలలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, దక్షిణాది రాష్ట్రాలకు నీట్, నెట్, యూపీఎస్ పరీక్షల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
రాష్ట్రాలలో ఐటీ రంగాన్ని పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలని, రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఏపీ కి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆర్పీఐ (భీంరావు అంబేద్కర్)కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కి రాజీనామా చేశానని వినోద్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో బోయ శంకర్, అలిగె జీవన్ పైసలు పాల్గొన్నారు.






