31 May, 2026 | 1:03 AM

కాలనీలో మరో సంక్షేమ సంఘం ఏర్పాటుపై అభ్యంతరం

31-05-2026 12:00 AM

కుషాయిగూడ, మే 30 (విజయక్రాంతి): నాగారం డివిజన్లోని సత్యనారాయణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవహారం వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఎన్నికల ద్వారా ఏర్పడిన అసోసియేషన్ ఉండగా, మరో అసోసియేషన్ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం పట్ల కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు రెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అసోసియేషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు.

కాలనీ అభివృద్ధే లక్ష్యమైతే కొత్తగా ఏర్పాటైన అసోసియేషన్ కూడా ఎన్నికలు నిర్వహించి అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ అనుమతి లేకుండా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు రోడ్డు నంబర్5లో నిర్వహించనున్న సమావేశానికి కాలనీ పెద్దలు, వివిధ కాలనీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.