calender_icon.png 9 January, 2026 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌ను కలిసిన మంచరామి సర్పంచ్ ఉప్పు లక్ష్మీ

07-01-2026 06:51:01 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను బుధవారం పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మీ  కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నూతన స్కూల్ భవనం మంజూరు చేయాలని కోరారు. అలాగే గ్రామానికి సంబంధించి పలు  సమస్యల ను తెలిపారు,  కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ లక్ష్మి తెలిపారు,