calender_icon.png 10 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు వ్యాసరచన పోటీ

07-01-2026 06:48:19 PM

సిద్దిపేట క్రైం:  రోడ్ సురక్ష, రహదారి భద్రత అభియాన్ లో భాగంగా బుధవారం సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాల విద్యార్థులకు 'రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్'పై వ్యాసరచన పోటీ నిర్వహించారు. వ్యాసరచన పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన పి.సాయిచరణ్, బి.గౌతమ్ కృష్ణ, బి.నాగార్జున అనే ముగ్గురు విద్యార్థులకు ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, సీఐ ప్రవీణ్ కుమార్  బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, ఎన్సీసీ ఇన్చార్జి బాలయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ అఖిల్, రాజు పాల్గొన్నారు.