calender_icon.png 10 January, 2026 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి

09-01-2026 01:55:57 PM

యాంత్రీకరణ పథకానికి మళ్లీ శ్రీకారం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి(Relaunch Farm Mechanization Scheme) కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అశ్వరావావుపేట వేదికగా వ్యవసాయ యాంత్రీకరణ పథనం పునప్రారంభం అయింది. 14 ఏళ్ల క్రితం వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిలిచిపోయింది. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో(Ashwaraopeta Agricultural College) వ్యవసాయ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) మాట్లాడుతూ...  భద్రాద్రి జిల్లాలో 50 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. పంటలకు రసాయనాల వాడకంతో ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట పండుతోందని మంత్రి వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కంటే అధిక పంట దిగుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ సారి రికార్డు స్థాయిలో 148 లక్షల టన్నుల వరి పంట పండిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ స్థాయిలో పంట రాలేదని వివరించారు. దేశంలో తొలిసారి 70 లక్షల టన్నుల పంట సేకరణ జరిగిందని లెక్కచెప్పారు. పంట సేకరణకు సంబంధించి రైతులకు 48 గంటట్లో చెల్లిస్తామని వెల్లడించారు.