21 May, 2026 | 2:42 AM

డేవిడ్‌రెడ్డి దేశాన్ని ఎందుకు మోసం చేయాలనుకున్నాడు?

21-05-2026 12:34 AM

రాకింగ్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాను నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. హనుమారెడ్డి యక్కం టి దర్శకుడు. మరియా ర్యాబోషాప్కా, రమ్యకృష్ణ, సముద్రఖని, అభయ్ డియో ల్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే.. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘డేవిడ్‌రెడ్డి’.. అమాయక భారతీ యుల్ని హింసిస్తున్న ఆంగ్లేయులపై ప్రతిదాడులు చేస్తూ వారికి దడ పుట్టిస్తాడు. దీంతో డేవిడ్‌రెడ్డిని తమ కోసం పనిచేసేలా ఒప్పించాలని బ్రిటీషర్స్ ప్లాన్ చేస్తారు.

తర్వాత అమాయకుల్ని కాపాడే డేవిడ్‌రెడ్డి దేశాన్ని ఎందుకు మోసం చేయాలనుకున్నాడు?, అతన్ని అరెస్ట్ చేయాలని భారతీయులే ఎందుకు కోరుకున్నారు?, డేవిడ్‌రెడ్డి లక్ష్యం ఏంటి, బ్రిటీష్ యువతితో అతని ప్రేమకథ ఎలా సాగింది..? వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తి కలిగించింది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో వినోదం పంచనుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; డీవోపీ: ఆచార్య వేణు; యాక్షన్: సుప్రీమ్ సుందర్, వింగ్ చున్; ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి; ఆర్ట్: తాళ్లూరి కృష్ణ మోహన్. 

ఈఎంఐల చుట్టూ ‘వడ్డీ కాసులవాడ’

మంచు మనోజ్ హీరోగా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. బుధవారం మనోజ్ పుట్టినరోజు కావటంతో ఈ మూవీ టైటిల్ ‘వడ్డీ కాసులవాడ’ అని ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు టీమ్ ఓ కాన్సెప్ట్ వీడియోను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. టైటిల్ క్యాచీగా, మనోజ్ మేనరిజానికి తగ్గట్టు ఉండడంతో అందరిని ఆకట్టుకుంటోంది.

అందరి జీవితాల్లో భాగమైన ఈఎంఐ, వాయిదాల నేపథ్యంలో సాగే ఈ కథను హాస్యభరితంగా తెరకెక్కి స్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో గుండెను పిండేసే భావోద్వే గాలు కూడా ఉంటాయని టీమ్ పేర్కొంటోంది. తేజ్ ఉప్పలపాటి రచనాదర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా అప్డేట్స్ త్వరలో అందిస్తామని నిర్మాత రామబ్రహ్మం సుంకర తెలిపారు. 

బాలకృష్ణ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్ర.. 

బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మనోజ్ ఇందులో రా ఇంటెన్సిటీ, డార్క్ షేడ్స్ కలిగిన శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కొంటున్న ఈ మూవీ సెట్స్‌లోకి మంచు మనోజ్ త్వరలోనే అడుగుపెట్టనున్నారు.