మండాడి ముగించారు
26-04-2026 12:56 AM
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తోంది.
మదిమా రన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ -ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించగా, ఎస్‌ఆర్ కథిర్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డీఆర్‌కే కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ రాఘవ్ నిర్వహిస్తున్నారు.






