మంగాపురంలో బాలు..
ఆర్‌ఎక్స్100, మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులు, విమ ర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించను న్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హ్యూజ్ బజ్ క్రియే ట్ చేసింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ‘బాలు’ పాత్రలో కనిపించనున్నారు.
శనివారం పుట్టినరోజు సంద ర్భంగా బ్రహ్మాజీ క్యారె క్టర్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో మైక్ పట్టుకొని హ్యాపీ వైబ్‌లో కనిపించారు బ్రహ్మాజీ. అగ్ర నిర్మాత అశ్వి ని దత్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పీ కిరణ్ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి సంగీతా న్ని జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని జయకృష్ణ ఐఎస్‌సీ, ఎడిటిం గ్‌ను మాధవ్ కుమార్ గుల్లపాటి, ప్రొడక్షన్ డిజైన్‌ను సాహి సురేశ్ నిర్వహిస్తున్నారు.






