26 April, 2026 | 2:22 AM

సతీ లీలావతి వచ్చేది అప్పుడే

26-04-2026 12:57 AM

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నరేశ్ వీకే, సప్తగిరి, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్రన్, జాఫర్, జోషి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య భావోద్వేగాలు ఇంకెంత బలంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇలాంటి సునిశితమైన అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు దర్శకుడు తాతినేని సత్య. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని భావోద్వేగభరితంగానే కాకుండా వినోదాత్మకంగానూ చెప్పే ఫీల్ గుడ్ మూవీ ఇది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీశ్ సూర్య పనిచేస్తున్నారు.