22 July, 2026 | 7:36 PM

సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్

22-07-2026 07:05 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): జగన్నాధపురం గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్)ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు డిజిటలైజేషన్ ప్రక్రియను ములకలపల్లి మండల కాంగ్రెస్ బీఎల్ఎ  కోఆర్డినేటర్ సురభి రాజేష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి,ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సంబందిత సిబ్బందికి సూచించారు.ములకలపల్లి మండలంలో సుమారు 80 శాతం పూర్తయిందని  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని కోరారు.