వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం
22-07-2026 07:10 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఎరుపాలెం మండలం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ శాఖ వారు గాంధీ సెంటర్లో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం బుధవారం నిర్వహించారు తొలుత జాతీయ నాయకులకు పూలమాలలు వేసి మువ్వన్నెల జాతీయ జెండాకి శాల్యూట్ చేసి జనగణమన గేయాన్ని ఆలపించారు. అనంతరం స్థానికులకు పిల్లలకు స్వీట్లు పంపిణీ చేసి జాతీయ జెండా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు దూపకుంట్ల పుల్లారావు జిల్లా ప్రతినిధులు సంధ్య డి వి అప్పారావు మురళి కొప్పు పరమేశ్వరరావు స్థానిక పెద్దలు పాల్గొని జయప్రదం చేశారు.






