ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
పాలకవీడు, ఏప్రిల్ 16 : మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం గుడుగుంట్లపాలెం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి శంకర్ అధ్యక్షణ నిర్వహించడం జరిగింది. ప్రజా పాలన అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల పనితీరును పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో కొంతమంది సర్పంచ్లు మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాలు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ఉపాధి హామీ పథకం పేస్ గుర్తింపు హాజరు చాలా ఇబ్బందిగా మారింది చాలా మంది కూలీలకు పని చేసిన హాజరు పడక డబ్బులు రావట్లేదు అన్ని వాపోతున్నారు
ఊరిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి కొన్ని శాఖల అధికారులు తూతు మంత్రంగా కొన్ని పనులు చేసినవి చెప్పి సమావేశాని ముగించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్, కమలాకర్, ఎంపీడీఓ, లక్ష్మి, ఎస్‌ఐ, కోటేష్, వ్యవసాయ మండల అధికారి కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్, సోమ్య, విద్యుత్ ఏఈ, శ్రీనివాస్, గ్రామాల సర్పంచ్లు గ్రామ కార్యదర్శిలు తదితరులు పాలుగోన్నారు.






