17 April, 2026 | 2:52 AM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం

17-04-2026 12:48 AM

చివ్వెంల, ఏప్రిల్ 16 :ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చివ్వెంల మండల స్థాయి సమావేశం మండల ప్రత్యేక అధికారి భాను నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హత గల ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు మరియు రాబోయే పథకాలపై సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు తమ సందేహాలను అధికారులతో నివృత్తి చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.