17 April, 2026 | 2:52 AM

మక్కజొన్నలను ప్రభుత్వం కొనాలి

17-04-2026 12:50 AM

మార్కెట్ యార్డులోనే పడిగాపులు గాస్తున్నాం

గన్నీ బ్యాగులు, లారీలు లేవని కుంటిసాకులు చెప్తున్నారు

దళారులు తక్కువ ధరకు అమ్మాలని బెదిరిస్తున్నారు

నాగర్‌కర్నూల్, నిర్మల్ జిల్లాలో రోడ్డుపై రైతుల ధర్నా

నాగర్‌కర్నూల్/లక్ష్మణ చందా, ఏప్రిల్ 16(విజయక్రాంతి): మక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాగర్‌కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో రోడ్లపై మక్కజొన్న పంటను పారబోసి ధర్నా చేశారు.

ఐదురోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నా.. అధికారులు పట్టించుకో వడం లేదని, గన్నీబ్యాగులు, లారీలు లేవని కుంటిసాకులు చెప్తున్నారని ఆగ్రహించారు. మరోపక్క దళారులు గద్దల్లా వాలి, తక్కువ ధరకు అమ్మాలని బెదిరిస్తున్నారని, వర్షం వచ్చి, మా పంట తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో ట్రాఫిక్ స్తం భించిపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో అధికారులు మక్కజొన్న పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.

మార్కె ట్ యార్డ్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులు మాట్లాడుతూ దాదాపు ఐదు రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్య క్తం చేశారు. అధికారులు గన్నీ బ్యాగుల కొరత, లారీల కొరత ఉందంటూ కుంటి సాకులు చెబుతూ తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా లారీల్లోకి ఎత్తడం లేదన్నారు.

అదే సమయంలో దళారులు గ ద్దల్లా వాలిపోయి తమ మక్కజొన్నలను త క్కువ ధరకు కొనుగోలు చేయాలని ఒత్తిడి తె స్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మక్కజొన్న దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ ఒక్కో ఎకరాకు తక్కువ పరిమాణంలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎ దుర్కొంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్ నమోదు, వ్యవసాయ శాఖ అనుమతి ప త్రాలు, మార్క్‌ఫెడ్ వద్ద వేలిముద్రలు వంటి ప్రక్రియలతో రైతులను కార్యాలయాల చు ట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. తీరా గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.

వర్షం వస్తే తమ కష్టార్జిత ధాన్యం పూర్తిగా వర్షంలో కొ ట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆం దోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో నే మక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అధికంగా మక్కజొన్న ఉన్న గ్రామాలకు నేరుగా లారీలను పంపిం చి, ధాన్యం కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండల రైతులు మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.

నిర్మల్ జాతీయ రహదారిపై కనకాపూర్ వద్ద రైతులు రోడ్డుపై మక్కలు పోసి ధర్నా చేశారు. పంట చేతికొచ్చి నెలరోజులైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తీ వ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి ఎండను సైతం లెక్కచేయకుండా గంటసేపు రోడ్డుపై బైఠాయించారు. రాకపోకలకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొ ని ఉన్నతాధికారుల ఆదేశాలతో హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.