16 April, 2026 | 3:20 AM

ఇసుక రవాణాకు తప్పనిసరి

16-04-2026 01:46 AM
  1. ఇసుక అక్రమ రవాణా కు చెక్ పెట్టాలి

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

నారాయణపేట. ఏప్రిల్ 15(విజయక్రాంతి) : జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్ లతో పాటు రెవెన్యూ,వాటర్ షెడ్ పరిధిలోని చెక్ డ్యాం ల వద్ద నుంచి ఇసుక రవాణా చేసేందుకు అనుమతులు తప్పని సరి అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు.  ఇసుక అక్రమ  రవాణాకు  చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం  సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి  కలెక్టర్ అధ్యక్షతన  డి.ఎల్.ఎస్.సి సమావేశం గూగుల్ మీట్ ద్వారా జరిగింది.

వీసీ హాల్ నుంచి  కలెక్టర్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీంద్ర రెడ్డి, శ్రీను, భూగర్భ జల వనరుల శాఖ ఏ డీ రవి, కలెక్టరేట్ ఏ వో శ్రీధర్, మిషన్ భగీరథ ఎస్. ఈ. రంగారావు, ఇరిగేషన్ అధికారి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జల శాఖ,  సర్వే ల్యాండ్, నీటి పారుదల,వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు,అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఇరిగేషన్, నీటి జల వనరుల శాఖ ఏ డీ ని  ప్రశ్నించారు. మాగనూరు మండలంలోని 5 ఇసుక రీచ్ లు, ఉట్కూర్ మండలంలో 2, మక్తల్ లో రెండు,ధన్వాడ గోటూరు, కొత్తపల్లి, లింగాల చేడ్ రీచ్ ల నుంచి ఇసుక రవాణా కు ప్రతిపాదనలు పంపించడం జరిగిందని  మైనింగ్ ఏడి వివరించారు.

గుర్తించిన ప్రాంతాల నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణా కు అనుమతులు ఇవ్వాలని, ఆయా ప్రాంతాలలో సంబంధిత  శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి, పారదర్శక మైన  నివేదికలను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఒకరిద్దరు తహసీల్దార్ల పనితీరు పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.గూగుల్ మీట్ లో ఆయా మండలాల తహసీల్దార్లు, సిఐలు,ఎస్.ఐ. లు, కలెక్టరేట్ లోని సంబంధిత సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.