మానేరు రివర్ ఫ్రంట్ భూసేకరణ వేగవంతం చేయాలి
03-09-2025 01:09 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, సెప్టెంబరు 2 (విజయ క్రాంతి): మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో భాగంగా నదికి ఇరువైపులా ఉన్న ప్రైవేటు వ్యక్తుల నుండి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ భూముల సర్వే నెంబర్లు, భూ సేకరణ విస్తీర్ణం తదితర అంశాలపై ఇరిగేషన్ రెవిన్యూ, అధికారులతో చర్చించారు. సేకరణ ప్ర క్రియ ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ ప్రకాష్, ఆర్డీవో మహేశ్వర్, ఇరిగేషన్ డీఈలు వేణుగోపాల్, సంతోష్ పాల్గొన్నారు.






