రాష్ట్రస్థాయి కళోత్సవాలకు ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఎంపిక
03-09-2025 01:10 AM
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలో గత రెండు రోజులుగా నిర్వహించిన కళోత్సవంలో పట్టణంలోని తెలంగాణ మోడల్(ఆదర్శ) పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి, జిల్లా స్థాయిలో బహుమతులు గెలుచుకొని, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్మిన్ మంగళవారం తెలిపారు. వోకల్ మ్యూజిక్ సోలో విభాగాల్లో పాఠశాలకు చెందిన ధర్మశాస్త్రి మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా, వోకల్ మ్యూజిక్ గ్రూపు విభాగంలో అక్షిత్ గ్రూప్ రెండవ బహుమతి సాధించిందని, అదేవిధంగా ఫోక్ డాన్స్ గ్రూప్ విభాగంలో ఉజ్వల్ గ్రూప్ మూడో బహుమతిని సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ఘనత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.






