25 March, 2026 | 2:02 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ షురూ

23-09-2024 01:02 AM

సందడి చేసిన సినీనటి కీర్తి సురేశ్

ముషీరాబాద్, సెస్టెంబర్ 22 : (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రో డ్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ 20వ స్టోర్ ను ఆదివారం ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్‌తో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మాంగళ్య నిలిచిందని, ఈ స్టోర్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వివాహాది శుభకార్యా లకు ప్రత్యేక వస్త్ర ప్రపంచం మాంగళ్య షాపింగ్ మాల్ అని పేర్కొన్నారు.

షాపింగ్ మాల్ డైరెక్టర్లు పీఎస్ మూర్తి, కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారీ నాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ 12 ఏండ్లుగా వివిధ కలెక్షన్లతో కస్టమర్ల మన్ననలు పొందుతున్నామన్నారు. ఇప్పటివరకు 20 స్టోర్‌లు ప్రారం భించినట్లు వెల్లడించారు. మరోవారంలో హైదరాబాద్‌లోని నార్సింగ్, మణికొండలో మాంగళ్య బ్రాంచ్‌లు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తొడపనూరి అరుణ్ కుమార్, కార్తీక్, విశాల్, వరుణ్, ఫణి, సాయి పాల్గొన్నారు. నటి కీర్తిసురేశ్‌ను చూడడానికి అభిమానులు పోటీ పడ్డారు.