23 July, 2026 | 1:40 AM

బీఆర్‌ఎస్ ఆందోళన వల్లే మ్యాన్‌హోల్స్‌కు మరమ్మతులు

23-07-2026 01:04 AM

గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్

మేడ్చల్ అర్బన్, జూలై 22(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రైల్వే స్టేషన్ వరకు నెలకొన్న అండర్ డ్రైనేజీ మ్యాన్ హోల్ లను మరమ్మత్తు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టడం వల్లే అధికారులు మరమ్మతులు చేశారని  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ అన్నారు.

మ్యాన్ హోల్స్ లు పూర్తిగా తెరుచుకొని ఉండటం వల్ల రహదారి నుండి వెళ్ళే వృద్ధులు,చిన్నారులకు ప్రమాదకరంగా ఉన్నాయని మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు,వినతి పత్రాలకు స్పందించిన మున్సిపల్ డిసి సుధాంశ్ వెంటనే మ్యాన్ హోల్స్ మరమ్మత్తు పనులను మున్సిపల్ సిబ్బందిచే  చేయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు

.ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రైల్వే స్టేషన్ వరకు నెలకొన్న మ్యాన్ హోల్స్ మరమ్మత్తు పనులను చేయించిన మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కు మున్సిపల్ సిబ్బందికి భాస్కర్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.