23 July, 2026 | 1:40 AM

వంతెన మట్టి తొలగించిన రైతులు జాడ లేని గ్యాంగ్‌మన్లు

23-07-2026 01:05 AM

బోయినపల్లి: జూలై 22 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం దేశాయిపల్లి వద్ద వరద కాలువ వంతెనపైన ఉన్న   హోల్స్ లలో మట్టి కురుకపోగా వరద వెళ్లి ,కోదురుపాక రైతులు బుధవారం మట్టిని తొలగించి హోల్స్ శుభ్రం చేశారు.  బోయినపల్లి మండలం దేశాయిపల్లి వద్ద శ్రీ రాజరాజేశ్వర జలాశయం కు అనుసంధానంగా కాలువ నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో బోయినపల్లి నుంచి కొదురుపాక వరకు ప్రధాన రహదారి ఉండగా దేశాయిపల్లి వద్ద వంతెన  నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో  వంతెన పైన వరద నీళ్లు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా వరద నీరు కిందికి వెళ్లేందుకు హోల్స్ నిర్మాణం చేశారు.

కానీ  నిర్వహణ లోపంతో హోల్స్ మట్టితో కురుకపోగా వరద నీరు ,వర్షపు నీరు వంతెనపైన నిల్వ ఉండి ప్రయాణికులకు రైతులకు ప్రయాణం చేయలేకపోతున్నారు. వరద వెళ్లి, కొదురుపాక రైతులు బోయినపల్లి ఇతర ప్రాంతాలకు నిత్యం వ్యవసాయ పనులకు, కూలి పనులకు, ప్రభుత్వ కార్యాలయాలకు  మోటర్ సైకిల్లు ఇతర వాహనాలపై వెళ్తారు.

వర్షం పడిన సమయంలో ప్రయాణానికి ఇబ్బందులు కలుగగా బోయినపల్లి వైపు వెళ్తున్న రైతులు తమ వద్ద ఉన్న పారతో హోల్స్ చుట్టు, వంతెనపైన ఉన్న హోల్స్ లలో కూడా మట్టి తొలగించి శుభ్రం చేశారు. కానీ మరమ్మతు చేయాల్సిన గ్యాంగ్ మెన్ లు మాత్రం ఈ వైపు రాకపోవడంతో వర్షం పడిన సమయంలో ప్రయాణికులు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు అప్పుడప్పుడు ఇటువంటి చిన్న చిన్న పనులు గ్యాంగ్ మెన్ ల తో చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు