22 June, 2026 | 7:44 PM

Breaking News

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •  

ప్రాణాలు తీస్తున్న ఉన్మాదం

13-07-2024 12:05 AM

తెలంగాణలో ఇటీవలి కాలంలో సైకోల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తమ ప్రేమను అంగీకరించలేదని అమ్మాయిలపైన, వారి కుటుంబసభ్యులపైన క్రూరంగా దాడులు చేసి చంపేస్తున్న దురంతాలు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకు కాకుండా పోయిందన్న పగతో అమ్మాయి కుటుంబంపై దాడి చేసి అందర్నీ చంపడానికి యత్నించిన ఉన్మాది ఘటన వెలుగులోకి వచ్చింది. క్షణికోద్రేకంతో ఇలాంటి వాళ్లు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారో వారికైనా అర్థమవుతుందా? ఇన్ని ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆ యువకుడికి చివరికి దక్కింది జైలు జీవితమే. కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చడం తప్ప వారు సాధించేది ఏమీ ఉండదు. ప్రేమించడం తప్పు కాదు కానీ, తాము కోరుకున్న జీవితం దక్కలేదని ఇలాంటి ఘోరాలకు పాల్పడడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. 

 నాగరాజు, నార్కట్ పల్లి