10 July, 2026 | 5:33 PM

మనికా సంచలనం

07-05-2024 12:41 AM

ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాక్

కయెక్ (సౌదీ అరేబియా): భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ మనికా బాత్రా సంచలనం సృష్టించింది. సౌదీ స్మాష్ లీగ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ మన్యును ఓడించి తన సింగిల్స్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో మనిక 3 (6 11 11 12 మన్యును మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆమె తన ప్రత్యర్థిని కేవలం 37 నిమిషాల్లోనే చిత్తు చేయడం విశేషం. ఇక ప్రిక్వార్టర్స్‌లో జర్మనీకి చెందిన 14వ ర్యాంకర్ నినా మిట్టెల్‌హమ్‌తో మనిక తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడి హర్మీత్ దేశాయ్ గోర్పడే  3 (11 5 3 11 11 స్పెయిన్‌కు చెందిన 5వ సీడ్ అల్వరో రోబ్లెస్ గ్జియావో జంటను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంలో అహికా ముఖర్జీ ముఖర్జీ ద్వయం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తెలుగు తేజం శ్రీజ ఆకుల పోర్చుగల్‌కు చెందిన జీనీ సాహో చేతిలో ఓటమిపాలైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో శరత్ కమల్, మనవ్ ఠక్కర్‌లు పరాజయం పాలయ్యారు.