భారత్‌దే నాలుగో టీ20
సిల్హెట్: బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సోమవారం జరిగిన నాలుగో టీ20లో హర్మన్‌ప్రీత్ బృందం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (26 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. రిచా ఘోష్ (24), హేమలత (22), మంధన (22) తలా కొన్ని పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో రబేయా ఖాన్, మరుఫా అక్తర్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేసింది. దిల్హారా అక్తర్ (25 బంతుల్లో 21) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో ఆశా శోభన, దీప్తి శర్మలు తలా 2, రాధా యాదవ్, పూజాలు చెరొక వికెట్ పడగొట్టారు. హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకుంది. ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న మన అమ్మాయిలు ఈ విజయంతో సిరీస్‌లో 4 ఆధిక్యం దక్కించుకున్నారు. సిరీస్‌లో చివరి టీ20 గురువారం జరగనుంది.






