ముంబైకి ఓ గెలుపు
సూర్య అజేయ సెంచరీ
మెరిసిన పాండ్యా, తిలక్
హైదరాబాద్ పరాజయం
ప్లే ఆఫ్స్ దారులు దాదాపు మూసుకుపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ ఓ విజయం ఖాతాలో వేసుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై.. సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకొని సన్‌రైజర్స్‌పై నెగ్గింది. బౌలింగ్‌లో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా రాణించి రైజర్స్ హిట్టర్లకు కళ్లెం వేస్తే.. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ అజేయ సెంచరీతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను లాగేసుకెళ్లాడు.
ముంబై: వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్.. ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా దూరమైన తరుణంలో ముంబై రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. సోమవారం వాంఖడే వేదికగా జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 48, 7 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన పరుగులు జోడించాడు. అభిషేక్ శర్మ (11), హెన్రిచ్ క్లాసెన్ (2), మయాంక్ అగర్వాల్ (5), షాబాజ్ అహ్మద్ (10), అబ్దుల్ సమద్ (10) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి (20), మార్కో జాన్సెన్ (17) ఎక్కువసేపు నిలువలేకపోయారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. టాప్ బ్యాటర్లు రోహిత్ శర్మ (4), ఇషాన్ కిషన్ (9), నమన్ (0) విఫలమవడంతో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబైని సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్రలు), తిలక్ వర్మ (37 నాటౌట్; 6 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ అభేద్యమైన నాలుగో వికెట్‌కు 143 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. సూర్య పూర్తి సాధికారిక ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ అతడికి అండగా నిలిచాడు. సూర్యకుమార్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీతో రాజస్థాన్ రాయల్స్
తలపడ బంతితో పాండ్యా, బ్యాట్‌తో సూర్య..
పొట్టి ప్రపంచకప్‌నకు ఎంపికైన భారత జట్టులో కీలక సభ్యులైన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు సత్తాచాటారు. ఆల్‌రౌండర్ పాత్రకు హార్దిక్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్న మాటలు అక్షర సత్యాలను పాండ్యా బౌలింగ్‌లో నిరూపిస్తే.. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు మైదానంలో గర్జిస్తే ఎలా ఉంటుందో సూర్యకుమార్ చాటాడు. మొదట పాండ్యా తో పాటు పియూష్ చావ్లా బౌలింగ్‌లో రాణించడంతో రైజర్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఇక ఛేదనలో ఒక దశలో 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబైని సూర్య ఆదుకున్నాడు. బౌండ్రీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి మరో 16 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 173/8 (హెడ్ 48, కమిన్స్ 35 నాటౌట్; పాండ్యా 3/31, చావ్లా 3/33), ముంబై: 17.2 ఓవర్లలో 174/3 (సూర్య102 నాటౌట్, తిలక్ 37 నాటౌట్; భువనేశ్వర్ 1/22).
పాయింట్ల పట్టిక 2024
జట్టు మ్యా గె ఓ ర.రే పా
కోల్‌కతా 11 8 3 1.45 16
రాజస్థాన్ 10 8 2 0.62 16
చెన్నై 11 6 5 0.70 12
హైదరాబాద్ 11 6 5 12
లక్నో 11 6 5 12
ఢిల్లీ 11 5 6 10
బెంగళూరు 11 4 7 8
పంజాబ్ 11 4 7 8
ముంబై 12 4 8 8
గుజరాత్ 11 4 7 8
నోట్: మ్యా గె ఓ ర.రే పా






