8 July, 2026 | 2:42 AM

మనిక @ 24

15-05-2024 12:34 AM

కెరీర్ అత్యుత్తమ ర్యాంక్

న్యూఢిల్లీ: భారత ఏస్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ మనిక బాత్రా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మనికా 24వ ర్యాంక్‌లో నిలిచి కెరీర్ అత్యుత్తమ స్థానం దక్కించుకుంది. జెడ్డా వేదికగా జరిగిన సౌదీ స్మాష్ టోర్నీకి ముందు మనిక 39వ ర్యాంక్‌లో ఉంది. ఈ టోర్నీలో క్వార్టర్స్‌లో వెనుదిరిగినప్పటికి తన ప్రదర్శనతో 15 స్థానాలు ఎగబాకిన మనిక 24వ ర్యాంక్ దక్కించుకుంది.

దీంతో టీటీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ నిలిచిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా బాత్రా రికార్డులకెక్కింది. ‘ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. అయితే ఈ ర్యాంక్‌తో నేను పొంగిపోను. ఆటలో మరింత మెరుగైన ప్రదర్శన కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటా’ అని మనిక వెల్లడించింది.