15 June, 2026 | 11:30 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఘనంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలు

02-04-2026 01:00 AM

పూల అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారు

పెబ్బేరు, ఏప్రిల్ 1:మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తరా నక్షత్రం సందర్భంగా మణికంఠ స్వామి జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్య ప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశా రు.అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయం ప్రాంగణం స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగింది. భజన బృందం సభ్యులు డప్పు, డోలక్, తాళాలతో భక్తి గీతాలను ఆలపించగా, మహిళలు, పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.భక్తులు సమూహంగా కూర్చొని భజన కీర్తనలు చేయడం, నమస్కార భంగిమలో స్వామివారిని ప్రార్థించడం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అల్పాహారం కూడా వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన బృందం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.