2 April, 2026 | 3:08 AM

పెండింగ్ బిల్లులు ఇప్పించాలని వినతి

02-04-2026 12:59 AM

అలంపూర్ ఎప్రిల్ 1 గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో సర్పం చులు చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు లు ఇప్పించాలని ఆ దిశగా మాజీ సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీడీవోకు మాజీ సర్పంచులు విన్నవించారు. ఈ మేరకు బుధవారం ఉండవల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎంపీడీవో తిరుపతిని వారు కలిసి పెండింగ్ బిల్లుల సమస్యల అంశంపై వినతి పత్రాన్ని అందిం చారు.

అయితే గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గత ప్రభుత్వంలో సర్పంచులు అప్పులు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.అట్టి పనులకు సంబంధించి ఇంతవరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని వాపోయారు.అప్పులు తెచ్చిన వాటికి మిత్తిలు పెరిగి దయనీయ స్థితిలో ఉన్నట్లు మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభు త్వం మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నా రు. వినతి పత్రం అందించిన వారిలో ఉండవల్లి మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు సురవరం లోకేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచులు శేషన్ గౌడ్, నాగేష్, శివ నారాయణ, శివ రాములు, ఈదన్న,నరసింహ, తదితరులు ఉన్నారు