calender_icon.png 19 October, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించిన మంథని సింగిల్ విండో చైర్మన్

19-10-2025 04:46:34 PM

మంథని (విజయక్రాంతి): రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆదివారం రామగిరి మండలం రామయ్యపల్లికి పరామర్శకు విచ్చేస్తున్న మంత్రిని, రామయ్యపల్లి స్టేజి వద్ద సింగిల్ విండో చైర్మ కొత్త శ్రీనివాస్, నాయకులు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఏంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ అజీమ్ ఖాన్, నాయకులు చాట్లపల్లి సంతోష్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.