25 February, 2026 | 8:37 PM

మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లాగా మార్చుదాం

25-02-2026 07:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): మాదకద్రవ్యాల వినియోగం వల్ల ముఖ్యంగా యువత చెడిపోతున్నారని దాని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నియంత్రణ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రమాదల నివారణ శాంతి భద్రతల పర్యవేక్షణ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంపై అవగాహన కల్పించి ప్రజలు వాటి బారిన పడకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్గదర్శకాలు విక్రయించిన ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉన్నారు.