19-10-2025 04:42:37 PM
మంథని (విజయక్రాంతి): రామగిరి మండలంలోని రామయ్యపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సోమిశెట్టి మల్లయ్య దశదిన కార్యక్రమంలో ఆదివారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మంత్రి లక్ష్మణ్ మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి, కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రొడ్డ బాపు, మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.