25 February, 2026 | 7:59 PM

మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలి

25-02-2026 06:51 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కోతకు గురైన సీసీ రోడ్డు పక్కన మట్టితో మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం  ఆసిఫాబాద్ మండలంలోని మాణిక్ గూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని కోతకు గురైన సీసీ రోడ్డును కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పక్కన మట్టి కోతకు గురైన నేపథ్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే మరమ్మత్తులు చేపట్టి సమస్యను సరి చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆమె పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.