15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

“అరైవ్ అలైవ్” సందేశంతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

25-02-2026 06:48 PM

చివ్వెంల,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా చివ్వెంల మండలంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్ఐ కనకరత్నం ఆధ్వర్యంలో నేషనల్ హైవే–365 బీబీ వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, స్థానిక ప్రజలు, యువకులు కలిసి “అరైవ్ అలైవ్” (Arrive Alive) అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి బ్యానర్ ప్రదర్శించారు.

ట్రాఫిక్ నియమాలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించడం, అతివేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్ఐ కనకరత్నం సూచించారు. రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా అవగాహన లోపం, నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్లే జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన పొందడంతో పాటు భద్రతా నియమాలను పాటించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.