13 July, 2026 | 2:20 PM

నీతి ఆయోగ్ సిల్వర్ మెడల్ కు ఎంపికైన మానుకోట

01-08-2025 08:39 PM

గవర్నర్ చేతుల మీదుగా సిల్వర్ మెడల్ అందుకోనున్న కలెక్టర్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2024 మొదటి త్రైమాసికంలో మూడు బ్లాకుల్లో 5 సంతృప్తికర సూచికలను సాధించినందున మహబూబాబాద్ జిల్లాకు నీతి ఆయోగ్ సంస్థ(NITI Aayog Organization) రాష్ట్ర స్థాయిలో సిల్వర్ మెడల్ ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాజ్ భవన్ లో నిర్వహించనున్న సంపూర్ణ అభియాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) సిల్వర్ మెడల్ అందుకోనున్నారు.