19 April, 2026 | 1:49 AM

లివర్ డ్యామేజ్‌కి అనేక కారణాలు

19-04-2026 12:10 AM

మెడికవర్ వైద్యుల అవగాహన సదస్సు

ముకరంపుర, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): లివర్ (కాలేయ) సమస్యలు కేవలం ఆల్కహాల్‌తోనే వస్తాయనే అపోహ ప్రజల్లో ఉందని, అనేక కారణాలతో లివర్ డ్యామేజ్ అవుతుందని మెడికవర్ వైద్యులు అన్నారు. వరల్డ్ లివర్ డేను పురస్కరించుకొని శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నిరంతరంగా ఆల్కహాల్ సేవించడంతో లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. కల్తీ ఆహారం, కల్తీ నూనెల కారణంగా కూడా లివర్ డ్యామేజ్ అవుతుందన్నారు.

శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పారాసిటమా ల్ మాత్రలను ఆశ్రయిస్తున్నారని, పారాసిటామల్ డోస్ ఎక్కువైనా లివర్‌పై ప్రభావం చూపుతుందన్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుం డా ఏ మందులు వాడినా ఆరోగ్యానికి హానికరమేనని సూచించారు. కొన్ని క్యాన్సర్ల వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని, చెట్ల మందులు, పసర్లను నమ్ముకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు.

వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శరీరంలో అత్యంత కీలకమై న అవయవంగా కాలేయం పనిచేస్తుందని, దాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చన్నారు. మెడికవర్ ఆసుపత్రి సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో ఆసుపత్రి మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ ప్రణీత్, సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ తాహా, అనస్తీషియా డాక్టర్ వినయ్, క్రిటికల్ కేర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.