19 April, 2026 | 1:50 AM

స్టాండ్ అలోన్ పీజీపై చర్యలు హర్షణీయం

19-04-2026 12:09 AM

డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జీ రవిబాబు

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రి ల్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి తొలిసారిగా స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఏరియా ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేప ట్టిందని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జీ రవిబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, కింగ్ కోటి, పటాన్‌చెరు, ఆసుపత్రులతో పాటు గిరిజన ప్రాంతాల్లోని ఎంతో కీలకమైన భద్రా చలం ఏరియా ఆసుపత్రి కూడా ఎంపికైందని తెలిపారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాలలో ప్రతి విభాగానికి నాలుగు చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జీ రవిబాబుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి పిలిపించారు.

సంబం ధిత ఆసుపత్రికి అవసరమైన అన్ని ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చర్యలు పూర్తికాగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నా రు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభు త్వం అన్ని విధాల సహకారం అందించడం పెద్ద ముందడుగుగా నిలుస్తుందని, దీంతో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు మరింత అందుబాటులోకి వస్తాయని డాక్టర్ జీ రవి బాబు తెలిపారు.