29 June, 2026 | 10:04 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

బీఆర్‌ఎస్‌లో పలువురు యువకుల చేరిక

11-05-2026 12:39 AM

మేడ్చల్, మే 10(విజయ క్రాంతి): మేడ్చల్ కు చెందిన పలువురు యువకులు జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ప్రజలు మళ్లీ కెసిఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. వచ్చి అన్ని ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలుపొందడం ఖాయమన్నారు.

బి ఆర్ ఎస్ లో చేరిన వారిలో వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, భాస్కర్, ప్రవీణ్, మురళి, నవీన, రామకృష్ణ తో పాటు మరి కొందరు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్‌ఎస్ పార్టీ నాయకులు దయానంద్ యాదవ్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, జవహర్ నగర్ నాయకులు, కొండల్, రాజశేఖర్, బాబు తదితరులు పాల్గొన్నారు.