calender_icon.png 19 December, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

41 మంది మావోయిస్టుల లొంగుబాటు

19-12-2025 03:21:17 PM

హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి(Maoist) బిగ్ షాక్ తగిలింది. డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) ఎదుట 41 మంది మావోయిస్టులు(Maoists surrendered) లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలను తెలంగాణ డీజీపీ మీడియా సమావేశంలో వివరించారు. కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎర్రగుళ్ల రవి, ఆరుగురు ఒడిశా, ఛత్తీస్ గఢ్ కు చెందిన డివిజన్ కమటీ సభ్యులు లొంగిపోయారని చెప్పారు.

మావోయిస్టుల వద్ద నుంచి 24 తొపాకులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వివిధ దళాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోయారని, లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు, మిగతా వాళ్లు ఛత్తీస్ గఢ్ వాసులు,  కామారెడ్డి జిల్లా వాసి ఎర్రగొల్ల రవి.. కుమురం భీమ్ డివిజన్ కమిటీ కార్యదర్శి, ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు, సౌత్ సబ్ జోనల్ కమిటీకి చెందిన ఐదుగురు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. 2025లో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వివరించారు.