calender_icon.png 19 December, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోండీ బీచ్ కాల్పులపై స్పందించిన డీజీపీ

19-12-2025 03:47:27 PM

ఆస్ట్రేలియా బోండీ బీచ్ లో కాల్పులు

సాజిద్ అక్రమ్ హైదరాబాదే.. దాడికి సబంధం లేదు

హైదరాబాద్: ఆస్ట్రేలియా బోండీ బీచ్(Bondi Beach)లో కాల్పులపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) స్పందించారు. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కు చెందినవాడేనని డీజీపీ వెల్లడించారు. ఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్ కు సంబంధం లేదని ఆయన వివరించారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ ఆరుసార్లు భారత్ కు వచ్చాడు. ఆస్ట్రేలియాలోనే యూరోపియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక 1998లో భార్యతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడు. సాజిద్ చివరిసారిగా 2022లో తల్లి, సోదరిని చూసేందుకు నగరానికి వచ్చినట్లు డీజీపీ సూచించారు.