టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్
30-03-2026 01:43 AM
ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం హుస్సేని ముజీబ్
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం హుస్సేని ముజీబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. రెండో సారి వీరు ఎన్నికయ్యారు. ఆదివా రం బీటీఎన్‌జీవో హౌసింగ్ సొసైటీ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర సంఘం ఎన్నికల నా మినేషన్ ప్రక్రియ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సభ్యులంతా వారి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోసారి నూతనంగా ఎన్నికైనందుకు అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కేంద్ర సంఘం నాయకులు వారిని ఘనంగా సన్మానించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.




