13 April, 2026 | 2:31 AM

ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

13-04-2026 01:00 AM

నిజాంసాగర్ ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి, జక్కాపూర్ గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలను ఆదివారం నాడు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాగి గ్రామానికి చెందిన కొప్పుల ప్రవీణ్ వివాహ వేడుకలో హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో జక్కపూర్ సర్పంచ్ పోచయ్య, ఆరేపల్లి సర్పంచ్ నందస్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా పండరి, జనార్ధన్ రెడ్డి, రాజం సాయిలు తదితరులు పాల్గొన్నారు.