సమాచార హక్కు చట్టం వజ్రాయుధం లాంటిది
సమాచార హక్కు చట్టం కామారెడ్డి జిల్లా కార్యదర్శి బండారి శంకర్
కామారెడ్డి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 2005లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు యువకులు వజ్రాయుధంగా మలుచుకొని మానవ హక్కులను పరిరక్షించు కోవాలని అఖిలభారత సమాచార హక్కు చట్ట రక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ పేర్కొన్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పథకాలు వాటి ఖర్చుల వివరాలు బహిర్గతం చేయడంలో ప్రతి అంశం ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది అని వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశద్వారం వద్ద సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయాలి. అందులో సంబంధిత అధికారి హోదా ఫోన్ నెంబర్లు స్పష్టంగా పేర్కొనాలి. సమాచారం కోసం కార్యాలయ సమాచార అధికారికి 6(1) ప్రకారము దరఖాస్తు పెట్టుకోవాలి.
30 రోజులలో సమాచారం అందించని పక్షంలో ఆపిలేట్ అధికారికి ఆపిల్ చేసుకోవాలి. అప్పటికి సమాచారం ఇవ్వకపోతే సమాచార హక్కు రాష్ట్ర కమిషనర్ కు అప్పిలు చేసుకోవచ్చును. ఈ చట్టం గురించి తెలియక విద్యార్థులు యువకులు, కార్యాలయాలు చెట్టు తిరుగుతూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఈ చట్టం అందరికీ తెలిపేందుకు దోమకొండ మండల కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు చట్టం కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 9397312396 నంబర్ను సంప్రదించవచ్చునని ఆయన వివరించారు.




