05-12-2024 01:38:14 AM
*రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
నిర్మల్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): రూ.7 వేలు లంచం తీసుకుంటూ నిర్మల్ జి ల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ బుధవా రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీ బీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. దడ్వాయి లైసెన్సు కోసం మార్కెట్ కార్యాలయంలో కుమ్మరి వెంకటేశ్ దరఖా స్తు చేసుకున్నాడు.
దాని కోసం రూ.10 వేలు లంచం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. తన వద్ద అంత లేదని చెప్పడంతో వా రం రోజులుగా లైసెన్సు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. చివరికి రూ.7 వేలకు శ్రీనివాస్‌తో ఒప్పందం చేసుకొని వెంకటేశ్ ఏసీబీని ఆశ్రయించాడు. బుధ వారం రూ.7 వేలు కార్యాలయంలో ఉన్న శ్రీనివాస్‌కు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆదిలా బాద్‌లోని శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు దాడులు చేసి విలువైన ప త్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సీఐ పూర్ణచందర్‌గౌడ్, ఎస్సై కిరణ్‌రెడ్డి ఉన్నారు.