6 June, 2026 | 10:47 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

ఆద్యంతం లాభాల్లోనే మర్కెట్లు

01-08-2024 01:10 AM

జీవితకాల గరిష్ఠాలకు సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్ వంటి షేర్ల అండతో సరికొత్త గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలూ కలిసొచ్చాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచగా... అమెరికా ఫెడ్ నిర్ణయాలు బుధవారం రాత్రికి వెలువడనున్నాయి. సెన్సెక్స్ ఉదయం 81,655.90 పాయింట్ల వద్ద లాభాల్లో (క్రితం ముగింపు 81,455.40) ప్రారంభమై రోజంతా లాబాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,828.04 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 285.94 పాయింట్ల లాభంతో 81,741.34 వద్ద ముగిసింది.

నిఫ్టీ 93.85 పాయింట్ల లాభంతో 24,95115 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.76గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర మళ్లీ పుంజుకుని ఔన్సు 2466 డాలర్ల స్థాయికి చేరింది.