12 March, 2026 | 4:17 PM

పురుగులమందు తాగి వివాహిత మృతి

23-05-2025 12:00 AM

లక్షెట్టిపేట, మే 22: మున్సిపాలిటీ లోని  మోదెలకు చెందిన ఎలగతి శ్రీలత (29) అనే  వివాహిత గడ్డి మందుతాగి చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందిందని ఎస్త్స్ర సురేష్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి భర్త సురేష్ కూతురు (6), ఆద్యశ్రీ  కొడుకు మహన్స్ (3) అనే. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు. ఆద్యశ్రీకి చిన్నతనం నుండి అనారోగ్యంగా ఉండటం ఆసుపత్రుల్లో తిరిగి మందులు వాడిన నయం కాకపోవడంతో ఇల్లుమార్చాలని వేరే కాపురం పెడదామని భర్తను కోరే ది.

కుదరకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 19వతారీకున ఇంట్లో గడ్డి మందుతాగిందన్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. మృతురాలి తండ్రి సందేల మల్లయ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.