calender_icon.png 23 May, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసదుద్దీన్ ఒవైసీ దిష్టిబొమ్మ దగ్ధం

22-05-2025 10:34:52 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ముస్లిం మత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంఐఎం అధినేత పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) బిజెపి పార్టీపై, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, హిందూ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గురువారం బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వంలో క్లాక్ టవర్ సెంటర్లో ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం సవరణలు చేపట్టిన వక్ఫ్ చట్టం 2025 ఏమి లాభాలు ఉన్నాయో చెప్పాలి అని అన్న ఓవైసీ ఘాటుగా సమాధానం చెప్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టంలో దేశంలో వక్ఫ్ ఆగడాలను అడ్డుకొని,పేద ముస్లింలకు మంచి చేయడానికే మన మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు-2025 తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ప్రజలకు చేరువ చేయకుండా, అపోహలు సృష్టించి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారని అన్నారు. ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి లాభాలు చేకూరనున్నాయని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ మోర్చా కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటిలోని ముస్లిం మహిళలకు, యువతకు ఈ సవరణ బిల్లు ద్వారా వచ్చే ప్రయోజనాలు తెలియజేయాలని సూచించారు. అలాగే, కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సమాజాన్ని తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ బిల్లుతో ముస్లిం సమాజానికి నష్టం జరుగుతుందనే అపోహలను ప్రజల్లోనుండి తొలగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వక్ఫ్ సవరణ బిల్లులో ఇంతకు ముందు లేకా ఇక ముందు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించబడిన ఏ ప్రభుత్వ భూమి లేదా ఆస్తి ఇకపై వక్ఫ్‌గా పరిగణించబడదన్నారు.వక్ఫ్ ఆస్తి యాజమాన్యంపై వివాదాలను కలెక్టర్లు నిర్ణయించవచ్చు అని సవరణలు చేశారని,ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డులలో 2 సభ్యులుగా ఉంటారన్నారు.దేశంలోని ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ఏకపక్షంగా ప్రకటించడానికి వక్ఫ్‌బోర్డ్‌కు అధికారం కల్పిస్తోన్న సెక్షన్ 40 రద్దు చేస్తూ సవరణలు చేయబడిందన్నారు. తద్వారా ఇకపై ఏ ఆస్తినీ ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడం సాధ్యం కాదన్నారు.

అదేవిధంగా నిన్న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ వస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి సుమారు 15 గంటల పాటు పోలీస్ నిర్బంధించడం సిగ్గుచేటని అలాగే ఒక జిల్లా అధ్యక్షులుగా నల్లగొండ జిల్లా కేంద్రానికి నేను వస్తున్న సందర్భంలో పోలీసులు నన్ను అక్రమ అరెస్టు చేసి సుమారు 15 గంటల పాటు పోలీసు వాహనాలు మార్చుతూ, మా మొబైల్ ఫోన్లను లాక్కొని కనీసం అన్నం కూడా పెట్టకుండా అన్ని పోలీస్ స్టేషన్లను తిప్పుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు.

నల్గొండ జిల్లా పోలీసులు ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి తొత్తులుగా పనిచేస్తున్నారని రాబోయే రోజుల్లో నల్లగొండ పోలీసులపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తామనితెలిపారు. గతంలో ఈ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత ప్రధాని  నరేంద్ర మోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మోహన్ భగవత్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తే జిల్లా పోలీసులకి ఫిర్యాదు చేసిన తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసుల స్వలాభం కోసం పోలీసుల పోస్టింగుల కోసం ఇసుక క్వారీల దగ్గర వసుల్ల కోసం మరియు నిన్న మొన్న జరిగినటువంటి మోటారు దొంగతనాల్లో దొంగల నుండి లక్షల లక్షల రూపాయలు కమిషన్ తీసుకొని కేసుని పక్కదారి పట్టించారని త్వరలోనే జిల్లా పోలీసు అధికారుల చిట్టా విప్పబోతున్నామని తెలిపారు.

నిన్న నల్లగొండ జిల్లా కేంద్రానికి బహిరంగ సభ పేరుతో వచ్చినటువంటి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రవాదులకు అడ్డగా నల్లగొండలో నివసిస్తున్నటువంటి ఉగ్రవాదులను కలిశారని  ఆరోపిస్తున్నాము వెంటనే పోలీసులు నిజ నిజాలు తేల్చాలని కోరారు. అసదుద్దీన్ ఒవైసీ నువ్వు పోలీసులను అడ్డుపెట్టుకొని నల్లగొండ జిల్లాకి వచ్చావు కానీ ఏ పోలీసులు లేకుండా జిల్లాకు వచ్చే ధైర్యం ఉన్నదా నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్న మీరు నిన్న సభలో చేసిన ఆరోపణలని బహిరంగ చర్చకి సిద్ధమా మీ వెంట ఈ జిల్లా మంత్రి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఐఎం పార్టీ  నాయకులని కాంగ్రెస్ పార్టీ నాయకులని, కమ్యూనిస్టు పార్టీ నాయకులని, టిఆర్ఎస్ పార్టీ నాయకులని తీసుకొని రండి మేము సమాధానం చెప్తామని ఆరోపించారు.

అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ అండదండను చూసుకొని మీ చెంచాలు నల్లగొండలోని వక్ఫ్ కబ్జాలు చేసి నేడు ఆ ఆస్తులని వెంచర్లుగా చేసి డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరల్లి చంద్రశేఖర్, భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతే పాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పకీరు మోహన్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రావు, మండల వెంకన్న, పజ్జురి వెంకట్ రెడ్డి, యువ మోర్చా నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, దిండు భాస్కర్ గౌడ్, గుండ్లపల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.