31 July, 2026 | 12:15 PM

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై యువతి ఫిర్యాదు

31-07-2026 11:38 AM

 రేగా కాంతారావు పంజాగుట్ట PSలో లైంగిక వేధింపుల కేసు 

పెళ్లిపేరుతో లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు 

తనకు తెలియకుండా వీడియోలు తీశాడని ఆరోపణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై(Former MLA Rega Kantha Rao) పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station)లో యువతి ఫిర్యాదు చేసింది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో డబ్బు తీసుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. డబ్బు తీసుకున్నాక పెళ్లి పేరుతో లైంగికంగా వేధించారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు తెలియకుండా వీడియోలు తీశాడని బాధితురాలు ఆరోపించింది. రేగా కాంతారావుపై కేసు నమోదు చేసిన పంజాగుట్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.