31 July, 2026 | 11:55 AM

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

31-07-2026 11:23 AM

బేల జూలై 31(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు పూర్తిగా నీటమునిగాయి. పొలాల్లో నిల్వ నీరు చేరడంతో పత్తి, సోయాబీన్, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఎక్కువసేపు నిల్వ ఉండటంతో పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే నష్టపోయిన పంటలను పరిశీలించి, ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా భారీ వర్షాల వల్ల వ్యవసాయ భూమి పూర్తిగా నీటమునిగి పంటలు దెబ్బతిన్నాయి.