28 June, 2026 | 12:09 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

మార్షల్ ఆర్ట్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి

08-02-2026 12:00 AM

తైక్వాండో ఛాంపియన్ షిప్ అసోసియేషన్ చైర్మన్ మహేశ్వర్

ముషీరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మార్షల్ ఆర్ట్స్  ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, తనను తాను రక్షించుకునే విధంగా నమ్మకం కలిగిస్తాయని తైక్వాండో చాంపియన్ షిప్ అసోసియేషన్ చైర్మన్ మహేశ్వర్, జనరల్ సెక్రెటరీ, మీర్ వహాజ్ అలీ ఖాన్, కోశాధికారి మారుతి వరప్రసాద్ అన్నారు. 9 వ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ సీనియర్ 2026 పోటీలు శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భం గా ఆయన హాజరై పోటీలను ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మార్షల్ ఆరట్స్ నేర్చుకోవాలని సూచించారు. ఆత్మ రక్షణతో పాటు శారీరక దారుడ్యాన్ని పెంపొందిచుకోవచ్చన్నారు. పిల్లల్లో వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని వారు అన్నా రు. ప్రతి పోటీల్లో జయాపజయాలు సర్వసాధారణమని, ఓడిపోయామని నిరాశ చెంద వద్దని  వారు సూచించారు. మరోసారి ప్ర యత్నిస్తే తప్పక విజయం వరిస్తుందన్నారు. ఈ పోటీలలో 600 మంది క్రీడాకారులు  పాల్గొనగా విజేతలకు,  వర్కిం గ్ ప్రెసిడెంట్  గుర్రం కృష్ణ, నరసింహ, బి. కృష్ణ, రమేష్, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో  క్రీడాకారులు పాల్గొన్నారు.