08-02-2026 12:00:00 AM
మేడిపల్లి,ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే మేడిపల్లి ఉప్పల్ బాలుర పాఠ శాల నాల్గవ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ సి ఓ రంగారెడ్డి బి రాజేష్, మేడిపల్లి ఎస్‌ఐ కృష్ణ య్య, యోగ గురువు వెంకట్ రెడ్డి, జెల్ ఏసు రత్నం రంగారెడ్డి పాల్గొని సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ విద్యా ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన మహానీయుడు పూలే అని ఆయన ఆశయాలకు అనుకూలంగా ప్రభుత్వం గురుకులాల ద్వారా న్యాయమైన విద్యను అంది స్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు.సభ కార్యక్ర మం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
తెలంగాణ జానపద నృత్యాలు, దేశ భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలు విద్యార్థులు స్టేజిపై సందడి చేశారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్ బాబు, పాఠశాల ఉపాధ్యాయ బృందం ,సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.